కడప జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నవని అందుకు సంబంధించి పనుల అనుమతులను జాప్యం చేయక సంబంధిత అధికారులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్ లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రెవెన్యూ సదస్సులు, గ్రామ సభలు, పౌర సరఫరాల పంపిణీ తదితరులపై జేసీ, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.