కడప : ఈనెల 7న ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ ఎదుట సిపిఎం ఆందోళన

16చూసినవారు
కడప : ఈనెల 7న ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ ఎదుట సిపిఎం ఆందోళన
కడప నగరంలో టెండర్ల ద్వారా రూములు దక్కించుకున్న వారికి 10 నెలలు గడిచినా ఇప్పటివరకు అప్పగించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ జూలై 7న ఉదయం 10 గంటలకు ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందనలేదని, అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్