కడప నగరంలో 15 వ డివిజన్ లోని సంజీవ నగర్ ఆచార్య కాలనీలో నెలకొన్న సమస్యలు, బోగస్ పట్టాలపై ఈనెల 15 నుంచి ఉద్యమ కార్యచరణ ప్రారంభించనున్నట్లు సీపీఎం నగర కార్యదర్శి ఎ. రామ్మోహన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కాలనీలో కొందరు డీకేటి పట్టాలను విక్రయిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.