మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు మరణిస్తున్న వేళ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేసులో తాను అప్రూవర్‌గా మారినందున భద్రత కల్పించాలని కడప ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. ముందు జాగ్రత్త కోసమే తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని దస్తగిరి తెలిపారు. ఈ పరిణామంతో వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు హత్యలా, సాధారణ మరణాలా తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.