తల్లి మందలించడంతో కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప చిన్నచౌకు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన బాలిక(14) తండ్రి ఏడాది కిందట మృతి చెందారు. పిల్లల పోషణభారం తల్లి చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో బాలిక మొబైల్ ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతోందని తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.