సచివాలయ సర్వేయర్ల బదిలీలకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెంటనే స్పందించారు. సచివాలయ సర్వేయర్ ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరగాలని, ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు ఉన్న పరిశీలించడం జరుగుతుందని, బదిలీలలో ఎటువంటి అవకతవకలకు పాల్పడిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జెసి అదితి సింగ్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశించారు.