కడప: వాహనాల తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ

60చూసినవారు
కడప జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి విస్తృతంగా వాహనాల తనిఖీలను పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని పలు కూడళ్ళలో స్వయంగా జిల్లా ఎస్పీ ఇ. జి అశోక్ కుమార్ వాహనాలను తనిఖీ చేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. రాత్రి సమయాలలో వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్