వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు తమ వంతు కర్తవ్యంగా భావించి కష్టించి పని చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష పిలుపునిచ్చారు. శుక్రవారం కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో నూతనంగా నియమితులైన వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటా, కృష్ణ చాన్ భాష, తదితరులను సన్మానించారు.