విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కడప జిల్లా ఎస్పీ ఇ. జి అశోక్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీసు అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను విచారించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు.