ప్రతి విద్యార్థికి ఏదో ఒక లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడి చదివితే ఆ లక్ష్యం మీకు చేరువవుతుందని విశ్రాంత ప్రిన్సిపాల్ ఏలూరు ప్రభుదాస్ సూచించారు. బుధవారం శాంతి సేవా సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుదాస్ వారి ఆర్థిక సహాయంతో కడప మద్రాస్ రోడ్డులోని ఎస్సీ బాల, బాలికల వసతి గృహాలలో ఉన్న విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు.