అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పినా చంద్రబాబు నాయుడు అవేమీ పట్టించుకోకుండా విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో జనంపై భారాలు మోపుతున్నారని, ఇదే తరహాలో కూటమి ప్రభుత్వం పయనిస్తే బషీర్ బాగ్ తరహా విద్యుత్ ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. శనివారం కడపలో విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ భవన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.