విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సి.ఐ.జి. ఈదురు బాషా విద్యార్థులకు సూచించారు. గురువారం కడప నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదిగేలా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రుల ఆశల్ని, ఆశయాలను నెరవేర్చేలా మీ వంతు కృషి చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.