కడప: కృపా కాలనీలో ఘనంగా మట్టల ఆదివారం

63చూసినవారు
కడప: కృపా కాలనీలో ఘనంగా మట్టల ఆదివారం
కడప నగరం 48 డివిజన్ కృపా కాలనీ నందు చర్చిలో న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి. మహేష్, సిస్టర్ శాంతమ్మల ఆధ్వర్యంలో ప్రజల క్షేమార్థం ప్రార్థనలు చేస్తూ ప్రత్యేకంగా మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. పి. మహేష్ మాట్లాడుతూ, యేసు క్రీస్తు మరణానికి ముందు ఓలీవ కొండ దగ్గర నున్న యెరూషలేముకు ప్రవేశిస్తున్న సమయంలో అక్కడి ప్రజలు దారి పొడవునా బట్టలను పరస్తూ కర్జూర మట్టలతో యేసు క్రీస్తుకు స్వాగతం పలికారన్నారు. ఆ మేరకు విశ్వాసులు చర్చిలో పాల్గొని కీర్తనలు ఆలపించారు.

సంబంధిత పోస్ట్