వైయస్సార్సీపి కడప జిల్లా నేత, కడప నగర పాలక మేయర్ సురేశ్ బాబును పదవి నుంచి తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులను అప్పగించి ఆయన మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొంది. మార్చి 28న షోకాజ్ నోటీస్ పంపిన ప్రభుత్వం ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో అనర్హత వేటు వేసింది. మేయర్ సురేష్ బాబు రూ. 36 లక్షల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.