పాఠశాలలు, కళాశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలు, జీతభత్యాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్, ఏపీ మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర ఉపాధ్యక్షులు చాంద్ బాషా, డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం భోజనం ఏజెన్సీలతో కలిసి కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.