కడప నగరం 15వ డివిజన్ ఆచార్య కాలనీలో మౌలిక సమస్యలు బోగస్ పట్టాలపై ఈనెల 15 నుంచి ఉద్యమ కార్యచరణ చేపడుతున్నట్లు సీపీఎ నగర కార్యదర్శి ఏ రామ్మోహన్ తెలిపారు. శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ కాలనీ దాదాపు 30 ఏళ్ల కిందట ఏర్పాటు అయిందని ఇప్పటికి కూడా అక్కడ మౌలిక వసతులు, రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్య పరిష్కరించడంలో పాలకులు, అధికార యంత్రాంగం విఫలమయ్యారని ఆరోపించారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.