దేశంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల మీద నరమేధాన్నీ కొనసాగిస్తున్నదని ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం కడప ప్రెస్ క్లబ్ లో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను హత్యగావిస్తుందని ఆరోపించారు.