వైయస్సార్ కడప జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా సహాయ సంచాలకులు (ఏ. డి. )గా పద్మజ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో సహాయ సంచాలకులు (ఏ. డి. )గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం సాధారణ బదలీపై కడప జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఈ జిల్లాలో ఏ. డీ. గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.