కడప బేడ బుడగజంగం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దూపం రాజు, తన కార్యవర్గంతో గురువారం ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కలిసారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం బేడ బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని, అది అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, మల్లి, లోకేష్, సుధాకర్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.