కడప: రేషన్ కార్డులో మార్పులకు, చేర్పులకు అవకాశం

61చూసినవారు
కడప: రేషన్ కార్డులో మార్పులకు, చేర్పులకు అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించినట్లు కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులకు, రేషన్ కార్డులో పేరు నమోదు, తొలగింపు, తదితర ఏడు రకాల సేవలు ప్రభుత్వం పునఃప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు స్థానిక గ్రామ, వార్డు సచివాలయాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్