విద్యుత్తు ఉత్పత్తి పేరిట తెలంగాణ, ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీశైలంలోని నీటిని ఖాళీ చేస్తున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కడప కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తిని నిలుపుదల చేయాలని డిమాండు చేశారు.