విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న దాదాపు 3200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కడప ఉక్కు పరిశ్రమను ప్రారంభించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కడప నగరంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏఐటీయూసీ, కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.