కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పికొట్టాలని సిఐటియు కడప జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కడప విద్యుత్ భవన్ ఆవరణంలో సమ్మె కోసం ప్రత్యేకంగా ప్రచురించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న నిర్వహించే నిరసనను జయప్రదం చేయాలన్నారు.