కడప జిల్లాలో మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలనీ కోరుతూ సిఐటియూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్మికులు కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరిక చేశారు. పారిశుద్ధ్య కార్మికులు 2023 డిసెంబర్ నెలలో నిర్వహించిన సమ్మెకు వేతనాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.