పేద ప్రజలపై పన్నులు వేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకున్న పట్టుదల, పన్ను కడుతున్న ప్రజలకు కనీస అవసరాలు మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ మొదలైన సమస్యలు తీర్చడంలో పాలక ప్రభుత్వం విఫలం చెందిందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అన్నారు. ఆదివారం కడప 15వ డివిజన్ శివానందపురంలో ఆయన పర్యటించారు. రోడ్డు మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో గుంతలు తీసారన్నారు.