2014 సంవత్సరం నుంచి గ్రామ సేవకులకు వేతనాలు పెంచలేదని వీఆర్ఏల యూనియన్ జిల్లా అధ్యక్షులు మనోహర్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్ర వెంకటపతి, జిల్లా కోశాధికారి అశోక్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, శివ, వెంకటసుబ్బయ్యలు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం కడప కలెక్టరేట్ లో జేసీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఇచ్చే వేతనం ఏ మూలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.