సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కడప శిల్పారామంలో శనివారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వర్మ, శిల్పారామం ఏవో శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయాలను మరచిపోవద్దని ప్రతి ఒక్కరూ పండగలకు విలువ ఇవ్వాలన్నారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా రమ్య రెడ్డి, సుప్రజ, సునీతలకు, రూ. 5వేలు, రూ. 3 వేలు, రూ. 2 వేలు నగదు బహుమతితో పాటు 20 మందికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు.