ప్రతి ఒక వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని కడప ట్రాఫిక్ పోలీసులు సూచించారు. శుక్రవారం కడప నగరంలోని పలు సర్కిల్స్ లో రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం యమలోకానికి సోపానం, అతివేగం మరణానికి మార్గం అంటూ అవగాహన కల్పించారు. పద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ప్రమాదాలకు అవకాశం ఉందని తెలిపారు.