కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్, కడప సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష కుమారి ఆధ్వర్యంలో మంగళవారం కడప న్యాయ సేవా సదన్ లో స్టాటిటరీ కమిటీ సమావేశం నిర్వహించారు. స్టాట్యూటరీ కమిటీ సమావేశంలో విక్టిమ్ కాంపెన్సేషన్ లో భాగంగా ఇద్దరు బాధితులకు రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. కడప ఏఎస్ పి, ఉమ్మడి జిల్లాల డిఆర్ఓలు పాల్గొన్నారు.