ఆర్. టి. సి. డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై ఆర్టీసీ ఆర్. ఎం కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కడప ట్రాఫిక్ సి. ఐ డి. కె జావీద్ శుక్రవారం అవగాహన కల్పించారు. సి. ఐ మాట్లాడుతూ ఆర్. టి. సి. బస్సులో ప్రయాణం అంటేనే సురక్షిత ప్రయాణం అని అన్నారు. సుమారు 40 నుండి 50 మంది ప్రయాణికుల ప్రాణాలు ఒక డ్రైవర్ చేతిలోనే ఉంటాయని ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు డ్రైవింగ్ చేయకూడదన్నారు.