కడపలో జరిగిన టీడీపీ మహానాడు నేపథ్యంలో పులివెందులలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై కేసు నమోదైంది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు చించడంతో పాటు కార్యకర్తలపై దాడి జరగడంతో కేసు నమోదై 15 మందిపై చర్యలు తీసుకున్నారు. ఏ1 నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, గంగిరెడ్డి పరారీలో ఉండగా, 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.