కవిగా, పరిశోధకునిగా, నాటక కర్తగా, సినీ గీతాల రచయితగా తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠం సి నారాయణ రెడ్డి అని రెడ్డి సేవా సమితి ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి అన్నారు. కడప రెడ్డి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గురువారం సేవా సమితి ప్రాంగణంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి నారాయణ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.