ఒక్క రక్తపు బొట్టు కూడా ఆపత్కర సమయంలో ఎంత విలువైనదో అందరికీ తెలుసుండాలని కడప సమాచారం, పౌర సంబంధాల శాఖ ఫోటోగ్రాఫర్ సోహైల్ అన్నారు. రక్తదాతగా ఇప్పటి వరకు 48సార్లు రక్తదానం చేశానని తెలిపారు. కరోనా సమయంలో విధులు నిర్వహించుకుంటూనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. రక్తదాన దినోత్సవాన్ని సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.