సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందేలు, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటాం అని కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కోడిపందేలు, పేకాట నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.