కడప కోటిరెడ్డి కూడలిలో విద్యార్థి సంఘాలు శనివారం ధర్నా నిర్వహించాయి. తల్లికి వందనం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడాన్ని సిగ్గుచేటుగా ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహించారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తల్లుల ఖాతాలో రూ.15,000 పూర్తి మొత్తాన్ని జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.