కడప: వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

54చూసినవారు
కడప: వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం సిజెఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. తదుపరి విచారణ మార్చికి వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్