గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. కడప నగరం, శివారులో గంజాయి సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టారు. ఫ్యాక్షన్ జోన్ సీఐ రమణారెడ్డి, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది, డ్రోన్ ఆపరేటర్ పాల్గొన్నారు.