పాలీసెట్ 2025 26 సంవత్సరానికి సంబంధించి ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలలోనికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీ నాటికి గడువు ముగియనున్నది. విద్యార్థులు టెన్త్ లేదా తత్సమాన కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులు, ఈ ఎంట్రన్స్ టెస్ట్ కు అర్హులని కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ శ్రీమతి సీహెచ్ జ్యోతి గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు, https: //polycetap. nic. in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.