కడప: సరళమైన తెలుగులో రామాయణం రచించిన గొప్ప కవియత్రి

71చూసినవారు
కడప: సరళమైన తెలుగులో రామాయణం రచించిన గొప్ప కవియత్రి
సరళమైన తెలుగు భాషలో రామాయణం రచించి సమాజానికి అందించిన గొప్ప కవియత్రి మొల్లమాంబ అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కడప కలెక్టరేట్ లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మొల్లమాంబ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్పీ అశోక్ కుమార్, సాహితీవేత్త నరాల రామారెడ్డి, మొల్ల సాహితీ పీఠం అధ్యక్షులు డా. విద్వాన్ హనుమంతరావు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్