కడప జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేటు విద్యా సంస్థలను సీజ్ చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు పి. ఎస్. ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలు చదువును వ్యాపార కేంద్రంగా మార్చుకొని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం లేదన్నారు. అనంతరం ఆర్జెడి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.