కడప నగరంలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయ్ బట్టర్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా లక్ష్మీనారాయణ సుదర్శన హోమము మహా పూర్ణాహుతి నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.