ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ ఘట్టం విజయవంతంగా, ఎలాంటి చిన్న ఘటనకు తావులేకుండా ముగిసేలా అవిశ్రాంతంగా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీ ఎస్పీ, సివిల్, ఏఆర్, ఇతర జిల్లాల నుండి వచ్చిన సిబ్బంది, జిల్లాలోని ఇతర ప్రత్యేక విభాగాల సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కలిసి విజయవంతం చేశారన్నారు.