వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరి కమిటీ సభ్యులు అంజద్ బాషా అన్నారు. ఆదివారం కడప నగరంలోని అంజద్ భాష ఇంట్లో వైసీపీ నాయకులు అంజద్ భాషను సన్మానించారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులైన సందర్భంగా అంజద్ భాషను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సమిష్టి కృషిగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.