కడప జిల్లాలో పోలీసు అధికారుల ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను జిల్లా పోలీసులు నిర్వహించారు. శనివారం సాయంత్రం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు వాహనాల తనిఖీలను చేపట్టారు. విద్యార్థినీ, విద్యార్థులకు, యువతకు, ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు, ద్విచక్ర వాహన దారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మైనర్ లకు వాహనాలు ఇవ్వడం నేరమని తెలిపారు.