కడప: అనుచిత వ్యాఖ్యలపై మహిళలు ఆందోళన

70చూసినవారు
కడప: అనుచిత వ్యాఖ్యలపై మహిళలు ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసిపి అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. మంగళవారం వైసిపి మీడియా సాక్షిలో వచ్చిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కడపలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ కడప నగరంలోని సంధ్య సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు సాగింది.

సంబంధిత పోస్ట్