జిల్లాల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల గురువారం కడపకు రానున్నారని పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మంగళవారం, బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పార్టీని బలపరచేందుకు ఈ పర్యటన ప్రారంభించామని షర్మిల తెలిపారు.