యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్ఝామినేషన్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావులు గురువారం విశ్వవిద్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆచార్య పద్మ మాట్లాడుతూ ఏప్రిల్ లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు త్వరితగతిన విడుదలకు కృషి చేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు.