కడప జిల్లా జెడ్పి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన జెడ్పి సర్వసభ్య సమావేశ సభ అజెండా బుక్కులను సభ్యులకు పంపరా అంటూ అధికారులను ప్రశ్నించారు. అజెండా బుక్కులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా సభ్యులకు పంపించామని డిప్యూటీ సీఈవో తెలపగా ఎవరికి గాని పంపలేదని రిజిస్టర్ పోస్టు ద్వారా వచ్చాయని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.