జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్బంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్. పి వి. హర్షవర్ధన్ రాజు జాతిపిత చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్. పి మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రాన్ని అందించి చరిత్రలోనే మహోన్నత వ్యక్తిగా, జాతిపితగా నిలిచారని కొనియాడారు.