ప్రజలు సీసీ కెమెరాలు యొక్క ఉపయోగం, ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మైదుకూరు పట్టణ సీఐ రమణారెడ్డి సూచించారు. సోమవారం రాత్రి మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న కేఫ్ దగ్గర ఉన్న ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దొంగతనాలపై సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి వివరించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ దుకాణాల వద్ద, గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.